English Version
హోం >> ఉచితంగానా ?
ఉచితం గానా?
అవును! తెలుగు CMS పూర్తిగా ఉచితం! మీరు చెయ్యవలిసిందల్లా మీకు నచ్చిన డొమైన్‌ని రిజిస్టర్ చేసుకొని మీ వెబ్‌సైట్‌ని హోస్ట్ చేసుకోవాలి.

తర్వాత మా తెలుగు CMS అప్లికేషన్‌ని మీ సర్వర్‌లో అప్‌లోడ్ చేసి ఇన్స్‌-స్టాల్ చెయ్యాలి. మీ కంపెనీ లోగో, ఇమేజెస్ లాంటివి మార్చుకొని మీ గురించి, మీ వ్యాపార సంస్థ గురించిన వివరాలని పోస్ట్ చేసుకోవాలి. తద్వారా మీ విలువైన ఖాతాదారులకు, మీరు ఉత్పత్తి చేసే వస్తువు వినియోగదారులకు, మీ సంస్థకి లేదా మీ సేవల గురించి పూర్తి సమాచారం నిమిషాలలో లభ్యం అవుతుంది.

గిఫ్ట్ ఎకానమీ?
తెలుగు CMS ని అర్ధ శాస్త్రంలో " గిఫ్ట్ ఎకానమీ " సూత్రం కింద రిలీజ్ చెయ్యబడినది. గిఫ్ట్ ఎకానమీ  అంటే  మీరు వాడే వస్తువుకి ఎటువంటి ధరని చెల్లించనవసరం లేదు. పూర్తిగా ఉచితంగా పొందవచ్చును. దీనికి ప్రతిఫలంగా  వస్తువుని లేదా సేవలని అందచేసిన వ్యక్తికి లేదా సంస్థకి మీరు " కానుక రూపంలో " మీకు తోచిన ప్రతిఫలం ఇస్తారు. మనం అందరం రోజూ వాడే వికీపీడియా దీనికి సరైన ఉదాహరణ. మీకు నచ్చిన అమౌంట్‌ని మాకు " పే-టీఎం (PayTM) " ద్వారా లేదా " పేపాల్ (PayPal) "ద్వారా ఇవ్వవచ్చు. మీరు ఖచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. గిఫ్ట్ ఎకానమీ గురించి మరింత తెలుసుకోవడం కోసం వికీపీడియలో ఈ పేజీని చూడండి.


https://en.wikipedia.org/wiki/Gift_economy