English Version
హోం >> తెలుగు CMS ఎందుకు?

సాధారణంగా ఒక మంచి వెబ్‌సైట్‌ని తయారు చేయించుకోవాలి అంటే దాదాపుగా 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. చిన్న చిన్న వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, డాక్టర్లు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు, కళాకారులకి ఇది కొంచెం కష్టమే. ఈ అవసరాన్ని తీర్చడానికి ఇంటర్నెట్‌లో చాలా ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయి ( వర్డ్ ప్రెస్, జూమ్లా, ధృపాల్ వంటివి). వీటిని ఉచితంగా వాడుకోవచ్చు. కానీ ఈ సాఫ్ట్‌ వేర్‌లను మన అవసరానికి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేసుకోవాలి. ఇది కాస్త ఖర్చుతో కూడిన విషయం. అంతే కాదు వీటిని ఎలా వాడాలో నేర్చుకోవడానికి కాస్త సమయం వెచ్చించాలి. అందువలన చాలామంది వీటికి దూరంగా ఉంటారు. ఈ ఇబ్బందులని (పెయిన్ పాయింట్స్)ని దృష్టిలో పెట్టుకొని తెలుగు CMSని తయారు చెయ్యడం జరిగింది. పేస్ బుక్ వాడడం చేతనైన ప్రతి వారు తెలుగు CMS ని వాడుకోవచ్చు.